మీకూ రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగానే రేషన్ కార్డు కూడా ఎంతో విలువైనది అని చెప్పవచ్చు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకే మనం పొందవచ్చు. ప్రతి నెల ఈ రేషన్ సరుకులను మనం ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం అందించే టటువంటి ఈ సరుకులు ప్రజల ఇంటివద్దకే వెళ్లి అందిస్తున్నారు.అయితే ఇకపై రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి అనే బాధ వినియోగదారులకు తప్పుతుందని చెప్పవచ్చు.
రేషన్ సరుకులు పొందాలంటే మరికొన్ని రోజులలో ఏటీఎంల ద్వారా రేషన్ బియ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికే హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం అని చెప్పవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఏటీఎం దగ్గరికి వెళ్లి వేలిముద్ర పెడితే మనకు రావాల్సిన సరుకులు మనకు వస్తాయి.
గ్రెయిన్ ఏటీఎం దగ్గర వేలి ముద్రతో పాటు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఏటీఎం ద్వారా రేషన్ సరుకులను అందుబాటులోకి తీసుకురావటం వల్ల నెలకు ఒకసారి మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు సరుకులను తీసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎం ద్వారా సరుకులను ఖచ్చితమైన తూకానికే పొందవచ్చు. ఈ విధంగా ఏటీఎం ద్వారా సరుకులను పొందడం నిజంగానే లబ్ధిదారులకు ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…