ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ఈ కరోనా పరిస్థితులను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది.ఈ విధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇంట్లోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఐదు వేల రూపాయల బహుమతిని సొంతం చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం My Gov India అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5000 పొందాలంటే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోకి ఒక ఆశక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో షేర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఫోటో షేర్ చేయడం ద్వారా ఎంతోమందిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాలని పేర్కొంది.
అయితే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోను షేర్ చేయడం కోసం https://bit.ly/3sFLakx లింక్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే Login to Participate ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసే ఆ తర్వాత వ్యాక్సిన్ వేసే సమయంలో మనం తీసుకున్న ఫోటోను మంచి ట్యాగ్ లైన్ తో షేర్ చేయాలి. ఈ విధంగా ట్యాగ్ లైన్ తో షేర్ చేసిన ఫోటోలను ప్రతి నెల 10 మందిని ఎంపిక చేసే వారికి 5000 బహుమతి ప్రకటిస్తారు. ఈ బహుమతి గెలుపొందాలంటే మనం చేసే ట్యాగ్ లైన్ అందరికీ వ్యాక్సిన్ గురించి స్ఫూర్తి నింపే విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.