యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దర్శకులు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజెస్ ఇస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం నుంచి కొమరం భీమ్ పోస్టర్ విడుదల చేయగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రకటన చేస్తూ ఎన్టీఆర్ కూల్ లుక్ ఒకటి విడుదల చేశారు ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన బుచ్చి బాబు సైతం ఎన్టీఆర్ తో త్వరలో సినిమా ఉంటుందని ఇండైరెక్టుగా తెలియజేశారు.
కేజిఎఫ్ లాంటి సెన్సేషనల్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు గత కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేశారు ప్రశాంత్ నీల్. రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.