ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్.. షార్ట్ ఫామ్‌లో పబ్‌జి.. ఈ గేమ్ గురించి తెలియని వారుండరు. అంతలా ఈ గేమ్ పాపులర్ అయింది. ఇప్పుడంటే ఇండియాలో ఈ గేమ్‌ను బ్యాన్ చేశారు. కానీ గ్లోబల్ వెర్షన్‌ను ఇండియన్ ప్లేయర్లు ఆడుతున్నారు. ఇక త్వరలోనే బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట పబ్‌జి గేమ్ మళ్లీ ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే పబ్‌జి గేమ్‌లో గేమ్ గెలిస్తే చివర్లో Winner Winner Chicken Dinner అని పడుతుంది కదా. గేమ్‌లో 100 మంది ప్లేయర్లు ఆడితే చివరికి మిగిలే ప్లేయర్లకు అలా వస్తుంది. అయితే నిజానికి Winner Winner Chicken Dinner అనే వాక్యం పబ్‌జి ద్వారా వచ్చింది కాదు. పబ్‌జిలో అది పాపులర్ అయింది, అంతే. ఈ వాక్యం నిజానికి ఎప్పుడు ఉద్భవించిందంటే…
1970లలో లాస్ వెగాస్ కసినోలలో ఒక చికెన్ డిన్నర్ ధర 2 డాలర్లుగా ఉండేది. ఆ కసినోలలో స్టాండర్డ్ బెట్ వేయాలంటే 2 డాలర్లు చెల్లించాలి. 2 డాలర్లు చెల్లించి బెట్ వేస్తే గెలిచారనుకోండి, ఆ మొత్తానికి ఒక చికెన్ డిన్నర్ వస్తుంది కదా.. అందుకనే విన్నర్లను ఉద్దేశించి Winner Winner Chicken Dinner అని పిలిచేవారు. అయితే కసినోలలో బాగా తిరిగే వారికి ఈ వాక్యం తెలుస్తుంది. ఇక దీన్ని పబ్‌జిలోనూ వాడారు. దీంతో Winner Winner Chicken Dinner అనే వాక్యం పాపులర్ అయింది. ఇదీ దీని వెనుక ఉన్న అసలు కథ.