ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ ధరలను ప్రకటిస్తూ ఆ సమస్థ శనివారం రాత్రి ప్రకటన చేసింది. అయితే భారత్ బయోటెక్ గతంలో వాటర్ బాటిల్ కన్నా ఎంతో చవకగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని తెలియజేసింది.అయితే ప్రస్తుతం ఈ కంపెనీ ప్రకటించిన ధరలను చూస్తే మాత్రం భారత్ బయోటెక్ మాట తప్పిందని తెలుస్తోంది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు 600 రూపాయలు కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు 1200 రూపాయలు చొప్పున ధరలను ప్రకటించింది. అయితే మన రాష్ట్రంలో వాటర్ బాటిల్ ధర ఎంత ఉందో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరతో వ్యాక్సిన్ అందిస్తామని తెలిపిన భారత్ బయోటెక్ ఈ విధంగా అమాంతం ధరలు పెంచుతూ ప్రకటన చేసింది.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ ధర ప్రభుత్వాలకు 400 రూపాయలు కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాయల చొప్పున విక్రయిస్తామని చెప్పింది.సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కన్నా, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ ధరలు అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.