కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితోపాటు పూర్తిగా కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు వైట్ ఫంగస్ కేసులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా యెల్లో ఫంగస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తికి యెల్లో ఫంగస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో యెల్లో ఫంగస్ మొదటి కేసు నమోదైంది.
ఘజియాబాద్‌లో ఉన్న ఓ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో యెల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే బ్లాక్, వైట్ ఫంగస్‌ల కన్నా యెల్లో ఫంగస్ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వ్యక్తి పరిశుభ్రతను పాటించకపోతే యెల్లో ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
యెల్లో ఫంగస్ బారిన పడిన వారిలో బద్దకం, ఆకలి లేకపోవడం లేదా తక్కువ ఆకలి ఉండడం, బరువు వేగంగా తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ వచ్చిన వారు ఈ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇక యెల్లో ఫంగస్ వచ్చినవారికి యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…