గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. గుత్తి వంకాయ కూర చపాతి, పరోటా వంటి వాటిలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నోరూరించే ఎంతో రుచికరమైన ఈ గుత్తి వంకాయ కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
*మీడియం సైజు వంకాయలు అరకిలో
*వేరుశనగ విత్తనాలు ఒక కప్పు
*కొబ్బెర ఒక కప్పు
*ఒక పెద్ద సైజు వెల్లుల్లి
*ఉల్లిపాయ ఒకటి
*రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి
*నాలుగు లవంగాలు
*కొత్తిమీర
*టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు
*ఉప్పు తగినంత
*కారం పొడి 2 టేబుల్ స్పూన్లు
*పసుపు
*నీళ్లు
*నూనె
ముందుగా గోళంలో వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకోవాలి. తరువాత నువ్వులను చిటపట అంతవరకు వేయించుకోవాలి. వేరుశనగ విత్తనాలు చల్లబడిన తర్వాత వేరుశనగ విత్తనాలు, నువ్వులు, కొబ్బెర, ధనియాల పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, లవంగాలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మసాలా తయారు చేసుకునేటప్పుడు నీరు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మసాలాను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ మసాలాలోకి నీళ్లు వేయకూడదు.
తరువాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత వంకాయలను పూర్తిగా కాకుండా తొడిమ వరకు నాలుగు ముక్కలుగా కత్తిరించి నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ముందుగా తయారు చేసుకొన్న మసాలాను కట్ చేసిన వంకాయలోపు పెట్టి గట్టిగా అదమాలి. ఈ విధంగా వంకాయలు అన్నింటిలోకి మసాలను పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి పోపు పెట్టాలి. ఆవాలు మగ్గిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న మసాలాలను వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలాలోకి చిటికెడు పసుపు వేసి మసాలా బాగా మగ్గిన తర్వాత మనకు కావలసిన నీటిని వేసుకోవాలి. నీరు బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మసాలా పెట్టిన వంకాయలను అందులో వేసి చిన్న మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత గిన్నెలో నూనె మొత్తం పైకి తేలితే మనకు గుత్తి వంకాయ కూర తయారైనట్లే.. వేడివేడిగా గుత్తి వంకాయ పరోటా లేదా చపాతీ వంటివాటిలోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…