కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మరో సారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది.ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుక్కొనే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ టీకాలకు తోడుగా మరొక మందును కనిపెట్టే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పొలం గట్ల వద్ద పెరిగే ఓ మొక్క పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
పొలంగట్ల వద్ద లభించే “అడ్డసరం” అనే మొక్క కరోనా వైరస్ పై ఎంత వరకు పనిచేస్తుందనే విషయం పై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్‌మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి సంస్థలు పరిశోధనలను ప్రారంభించాయి. ఈ పరిశోధనలలో ఈ మొక్క సానుకూల ప్రభావాలు చూపటంతో కరోనా విరుగుడు పై ఆశలను రేకెత్తిస్తుంది.
సాధారణంగా కరోనా బారిన పడ్డ వారిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం ఊపిరితిత్తులలోని కణజాలం దెబ్బ తినడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతుంది.అయితే ఈ మూడు సమస్యలను అధిగమించడంలో ఈ అడ్డసరం మొక్క దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావించారు.మన శరీరంలో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అదేవిధంగా రోగనిరోధకశక్తిని పెంపొందించే లక్షణాలు ఈ మొక్కలో అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.