India vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలోనే ఆ జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో జేసన్ హోల్డర్ (57) మినహా ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణకు 2, మహమ్మద్ సిరాజ్ కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ (60), సూర్య కుమార్ యాదవ్ (34)లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. హొసెయిన్‌కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.