Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంతకు సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమెను ఇప్పటికీ ఈ విషయంపై నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏది చేసినా.. సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. దానికి నెటిజన్లు నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. అయితే సమంత వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లు, విమర్శలు, ట్రోల్స్‌పై స్పందించింది. సోషల్ మీడియా అంటే ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయని, అయితే అన్నింటినీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏదీ శాశ్వతం కాదని, ఒక వారం అయితే అంతా మరిచిపోతారని పేర్కొంది.
ప్రస్తుతం తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నానని, తనకు కావల్సినంత స్పేస్ లభిస్తుందని సమంత తెలియజేసింది. తాను మాట్లాడినప్పుడు అది తన సైలెన్స్ కన్నా బాగుంటుందని చెప్పింది. తనకు ఎదురవుతున్నవన్నీ తాత్కాలిక సమస్యలేనని తెలియజేసింది.
కాగా సమంత విడాకుల విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె అవేమీ పట్టించుకోకుండా తన కెరీర్‌లో తాను బిజీగా ఉంది. ఇక సమంత త్వరలోనే కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీలో కనిపించనుండా.. యశోద అనే పాన్ ఇండియా ప్రాజెక్టులోనూ అలరించనుంది. అలాగే ఆమె నటించిన శాకుంతలం మూవీ కూడా ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీంతో త్వరలోనే ఈ మూవీ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సమంత ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.