Ileana : గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తున్న ఇలియానా యువత మతులను పోగొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఆమె మరో ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో ఆమె కొంచెం బరువు పెరిగినట్లు కనిపిస్తోంది.

మనకు ప్రస్తుతం ఫోన్లలో అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మన ఫొటోలను కావల్సినట్లు ఎడిట్ చేసుకునే సదుపాయం లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫొటోలలో మనల్ని మనం అందంగా, సన్నగా చూపించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి యాప్స్‌ను తాను వాడడం లేదని.. వాటిని ఫోన్‌లో నుంచి డిలీట్ చేశానని.. ఇలియానా తెలిపింది.
అంటే ఇలియానా ఇన్ని రోజులు సన్నగా కనిపించేందుకు ఆ యాప్స్‌ను వాడిందా.. అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోను చూస్తే మనకు అలాగే అనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలో ఇలియానా మరింత లావుగా కనిపిస్తుండడం.. అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఈమె ఫోన్‌లో స్లిమ్ యాప్స్‌ను డిలీట్ చేశానని చెబుతున్నప్పటికీ.. అసలు ఈమె ఎప్పటికీ ఇలాగే లావుగా ఉందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తాను ఎలా ఉండాలనుకుంటున్నానో.. అలాగే ఉన్నానని.. తన రియల్ బాడీని చూపించేందుకు ఎలాంటి సందేహం చెందడం లేదని ఇలియానా తెలియజేసింది. అయితే ఈ లుక్‌లోనూ ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తుండడం విశేషం. అయితే ఈమె కావాలనే ఏదైనా యాప్ ద్వారా లావుగా కనిపించేలా ఫొటోను ఎడిట్ చేసి దాన్ని షేర్ చేసిందా.. లేక ఆమె చెప్పినట్లు నిజంగానే లావుగా మారిందా.. అన్న విషయం తేలాల్సి ఉంది.