Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తరువాత మళ్లీ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ మూవీ హిందీలో ఎప్పుడో వచ్చేసింది. అక్కడ రిలీజ్ అయి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న పింక్ మూవీని రీమేక్ చేసి వకీల్ సాబ్ తీశారు.

ఇక తరువాత పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం కూడా రీమేక్ కావడం విశేషం. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే పవన్ తదుపరి చిత్రాన్ని కూడా ఇంకో మూవీకి రీమేక్‌గా తీయనున్నారు. అందులో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు.
తమిళంలో హిట్ అయిన వినోదయ సీతమ్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ పాత్ర నిడివి చాలా తక్కువట. సాయి ధరమ్ తేజ్ పాత్ర నిడివి ఫుల్ లెంగ్త్ ఉంటుందట. ఇక ఈ మూవీని చాలా త్వరగా షూటింగ్ చేసి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ నటిస్తున్నందుకు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇది రీమేక్ మూవీ కావడంతోపాటు ఇందులో పవన్ పాత్ర నిడివి కూడా తక్కువే. కనుక అలాంటి సినిమాలో పవన్ నటించడం ఏంటి ? అని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌తో నటిస్తే మంచిదే. కానీ సినిమాలో ఇద్దరి పాత్రల నిడివి పూర్తి స్థాయిలో ఉండాలని అంటున్నారు. ఇక ఒరిజినల్ కథతో సినిమా తీయకుండా ఈ రీమేక్‌ల గోల ఏంటని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అనేక భాషలకు చెందిన చిత్రాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు వాటిని ఆల్రెడీ చూసేస్తున్నారు. అలాంటి చిత్రాలను రీమేక్ చేయడం వల్ల కథ ముందుగానే తెలిసిపోతుంది కనుక థ్రిల్ ఏమీ ఉండదని.. పవన్ ఇప్పటికైనా ఒరిజినల్ కథతో సినిమా తీయాలని.. అప్పుడే ఆయన సినిమాలను చూస్తే థ్రిల్ కలుగుతుందని అంటున్నారు.
ఇక పవన్ నటిస్తున్న మరో రెండు చిత్రాలు.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్.. ఒరిజినల్ కథలే కావడం విశేషం. మరి పవన్ ఈ రెండు కాకుండా ముందు ముందు తీసే చిత్రాలు రీమేక్‌వే అవుతాయా.. ఒరిజినల్ కథతో సినిమాలను తీస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.