హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అయితే ఈ పదిహేను రోజులను సంతాప దినాలుగా భావించి పెద్దవారికి పిండప్రదానాలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అంతేకానీ ఏ విధమైనటువంటి శుభకార్యాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి సరైన సమయం కాదు.
ఈ క్రమంలోనే భాద్రపద అమావాస్య అక్టోబర్ 6వ తేదీన వస్తుంది కనుక అక్టోబర్ 6వ తేదీలోగా మన పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం ఎంతో ఉత్తమం.
ఇలా అమావాస్యలోగా పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతల శాపాలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలలో ప్రమోషన్లు, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అందుకే అమావాస్యలోగా మన పూర్వీకులను తలచుకొని పిండ ప్రదానం చేయటం ఎంతో మంచిది.
అదేవిధంగా అమావాస్య రోజు నదీ స్నానమాచరించి మూడు సార్లు చేతులతో నీటిని వదలటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ప్రతి అమావాస్య రోజు బియ్యం, కూరగాయలను బ్రాహ్మణులకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడుగా భావించి దానం చేయడం ఎంతో మంచిది.