నందమూరి బాలకృష్ణ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అఖండ. లెజెండ్, సింహా చిత్రాల తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ కోసం పని చేస్తున్నారు బాలకృష్ణ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అదే సమయానికి గని కూడా రానుండడంతో అఖండ వాయిదా పడుతుందని చెప్పుకొచ్చారు. కానీ అఖండ చిత్రం నవంబర్ 4న రానుందని సమాచారం.
పరాజయాల పరంపరతో ఇబ్బంది పడుతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ.. గతంలో రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. కరోనా వలన షూటింగ్‌కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎప్పుడో మొదలైన ఈ చిత్రానికి ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టారు. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైనట్టు మేకర్స్ తెలియజేశారు.
‘అఖండ’ మూవీ కోసం నందమూరి బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. అలానే కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అఖండ సినిమాను మే 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అప్పుడు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. అప్పటి నుంచి చిత్రీకరణ మాత్రం శరవేగంగా కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు పూర్తైంది.
🔥AKHANDA SHOOT WRAPPED🔥
The Shooting of #NandamuriBalakrishna & #BoyapatiSreenu’s Hattrick Film #Akhanda Wrapped up
Roaring in Cinemas Soon🦁with Exciting Updates💥#BB3 @ItsMePragya @MusicThaman @actorsrikanth @IamJagguBhai @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/vD76BeDXEF
— BA Raju's Team (@baraju_SuperHit) October 5, 2021