Onions : మనం ప్రతి రోజు ఉల్లిపాయను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంత ఖరీదైనా సరే ఇంటిలో ఉల్లిపాయలు ఉండి తీరాల్సిందే. ఎక్కువగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కొందరు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. పల్లెటూరులో చాలామందికి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది.
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్ రక్తం యొక్క స్థిరత్వాన్ని సక్రమంగా ఉంచడమే కాకుండా రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలను దరిచేరనివ్వదు. ఉల్లిపాయలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ ఇ అనేది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి డ్రాప్స్‌లో కూడా ఉల్లిపాయ రసంని ఉపయోగిస్తారు. ఆడవారికి మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె మరియు క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శ్వాసనాళం యొక్క కండరాలపై ప్రభావాన్ని చూపటం వలన ఆస్తమా రోగులకు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి సహకరిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఈ సీజన్ లో వచ్చే గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…