Chicken : సంక్రాంతి పండుగ సందర్బంగా చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంటుంది. అయితే ఈసారి కూడా అలాగే చాలా మంది ఊళ్లకు తరలివెళ్లారు. అయినప్పటికీ నగరంలో ఉన్నవారు మాత్రం భారీగా చికెన్‌ను లాగించేశారు.
గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల్లోనే హైదరాబాద్ వాసులు ఏకంగా 60 లక్షల కిలోల చికెన్‌ను తిన్నారు. సాధారణంగా మటన్ ధర ఎక్కువగా, చికెన్ ధర తక్కువగా ఉంటుంది. కనుక చికెన్ తినే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కిలో మటన్ ధర రూ.800 నుంచి కొన్ని చోట్ల రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ ధర మాత్రం కేజీకి రూ.240 వరకు పలికింది.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ వాసులు రోజుకు 10 లక్షల కిలోల చికెన్ తింటారు. కానీ సంక్రాంతి రోజుల్లో మాత్రం ఇంతకు రెట్టింపు స్థాయిలో చికెన్‌ను తినడం విశేషం. ఇక శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగ్గా.. ఒక్క ఆదివారం రోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడైంది.
ఇక సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో రోజుకు 2 లక్షల కిలోల మటన్ అమ్ముడవుతుంది. కానీ ఆదివారం రోజు ఏకంగా 5 లక్షల కిలోల మటన్‌ను కొనుగోలు చేశారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనూ 15 లక్షల కిలోల మేర మటన్‌ను విక్రయించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…