Viral News : ఆ తండ్రి తన కుమార్తెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ ఆమె మాత్రం తండ్రిని ఎదిరించి, కుటుంబ సభ్యులను కాదని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె బతికుండగానే ఆ తండ్రి పిండం పెట్టాడు. తన కుమార్తు చనిపోయిందని కర్మ చేశాడు. ఈ షాకింగ్ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు స్నేహితులుగా ఉంటూనే ప్రేమలో పడ్డారు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో వారు తమ తల్లిదండ్రులను ఎదిరించి, వారిని కాదని చెప్పి ఈ నెల 13వ తేదీన ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని చెప్పి తమ కుమార్తె అలా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఎంత మాత్రం భరించలేని ఆ తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తమ కుమార్తె బతికి ఉండగానే చనిపోయిందని ప్రకటించాడు. అంతేకాదు ఆమెకు కర్మకాండలు చేశాడు.
అలా ఆ తండ్రి తన కుమార్తె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. అనంతరం గుండు గీయించుకున్నాడు. ఆమె బతికి ఉండగానే ఆమెకు పిండ ప్రదానం చేశాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. ఇక ఈ వార్తకు సంబంధించి ఇంకో విషయం కూడా ప్రచారం జరుగుతోంది.
తమ కుమార్తె ఇష్టం మేరకు వివాహం జరిపిస్తానని ఆమె తండ్రి చెప్పినా ఆ యువకుడు వినలేదని, దీంతో వారు వివాహం చేసుకున్నారని.. ఈ క్రమంలోనే తనను కాదని చెప్పి అలా పెళ్లి చేసుకుందనే కోపంతో ఆ తండ్రి ఈ విధంగా చేశాడని అంటున్నారు. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…