Sreeja : ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీల జంటలు విడాకులు తీసుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన భార్యకు విడాకులు ఇవ్వగా.. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన సమంత, నాగచైతన్యలు కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య, ఆమె భర్త ధనుష్‌లు విడిపోతున్నట్లు చెప్పారు. దీంతో సెలబ్రిటీ జంటల విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక చిరంజీవి కుమార్తె శ్రీజ కూడా తన భర్త కల్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రీజ నిన్న మొన్నటి వరకు తన భర్తను యాడ్ చేసి సోషల్ ఖాతాల్లో పేర్లు పెట్టుకుంది. శ్రీజ కల్యాణ్ అని ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు ఉండేది. అయితే ఆమె తాజాగా తన పేరును మార్చుకుంది. కల్యాణ్ తీసేసి ఆ స్థానంలో కొణిదెల అని పెట్టుకుంది. ప్రస్తుతం శ్రీజ కొణిదెల అనే పేరు కనిపిస్తోంది. దీంతో వారు విడిపోతున్నారని.. అందుకు సాక్ష్యం ఇదేనని అంటున్నారు.
గతంలో సమంత కూడా అక్కినేని అనే ఇంటి పేరును తన సోషల్ ఖాతాల నుంచి తీసేసి కేవలం ఎస్ అనే ఆంగ్ల అక్షరాన్ని మాత్రమే పెట్టుకుంది. దీంతో సమంత, నాగచైతన్య విడిపోతారని పుకార్లు షికార్లు చేశాయి. తరువాత అవే నిజమయ్యాయి. వారు విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇక ఇప్పుడు శ్రీజ కూడా అలాగే పేరును మార్చేయడంతో.. శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఈ మధ్య కాలంలో కల్యాణ్ దేవ్ కూడా మెగా పార్టీల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే అతని తాజా మూవీ సూపర్ మచ్చిని మెగా ఫ్యామిలీ ఎవరూ ప్రమోట్ చేయడం లేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ ల విడాకులు నిజమే అని అనుమానాలు కలుగుతున్నాయి. వారిద్దరూ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారని.. అందుకనే శ్రీజ తన పేరు మార్చిందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…