Rakul Preet Singh : రకుల్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన కొండపొలం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా 8వ తేదీన విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం తాను కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా తాను ఎంపిక చేసుకునే కథలో ప్రతి పాత్ర తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే విధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తన ఆలోచనలను ఈ విధంగా బయటపెట్టారు. ఇక కొండపొలం సినిమాలో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతోందని, ఇందులో గొర్రెలు కాసే కాపరిగా ఓబులమ్మ పాత్రలో తాను సందడి చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు గ్రామీణ యువతిగా కరెంటు తీగ, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలలో కనిపించినప్పటికీ కొండపొలం సినిమాలో ఓబులమ్మ పాత్ర ఎంతో ప్రత్యేకమని.. ఇందులో తన లుక్, భాష అన్నీ పూర్తిగా భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఓబులమ్మ పాత్ర గురించి తెలియజేశారు. ఇక మూవీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని రకుల్ తెలియజేసింది.