Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనుండగా, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.
సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక మహానటితో భారీ విజయం తన ఖాతాలోవేసుకున్న నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అని ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు ప్రభాస్. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తో మరో సినిమా కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది.
https://twitter.com/imvangasandeep/status/1445986613075451905?s=20
ప్రభాస్ తన 25 వ సినిమాను అర్జున్ రెడ్డి ఫేం డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ టైటిల్ ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి సందీప్ రెడ్డి వంగా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 8 భాషల్లో తెరకెక్కనుంది. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రూపొందించాడట. ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం.