Health Tips : ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

Health Tips : మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషికి నిత్యం 2 నుంచి 3 లీట‌ర్ల నీరు అవ‌స‌రం. క‌చ్చింత‌గా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శ‌రీరం పూర్తిగా ఉపయోగించుకుని జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. క‌నీస మోతాదుకు త‌క్కువ‌గా నీరు తాగితే అనేక ర‌కాల అనారోగ్యాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే రోజుకి క‌నీసం 2 లీట‌ర్ల నీటిని తాగే ఆరోగ్యవంత‌మైన వ్య‌క్తులు 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జ‌న చేయాలి. 4 సార్ల క‌న్నా త‌క్కువ‌గా మాత్రం మూత్ర విస‌ర్జ‌న చేయ‌కూడ‌దు. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగ‌ని ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేసినా ఎలాంటి హానీ క‌ల‌గ‌దు.

Health Tips

ఆల్క‌హాల్‌, కాఫీ, టీ వంటివి తాగిన‌ప్పుడు, మూత్రాశ‌యం ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు, నీటిని అధికంగా తాగేవారు స‌హ‌జంగానే 7 సార్ల క‌న్నా ఎక్కువ‌గానే మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తులు, ఆయా స‌మ‌స్య‌లు ఉన్న‌వారు 7 సార్ల క‌న్నా ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన ప‌ని లేదు. అది స‌హ‌జ‌మే. అయితే కేవ‌లం 2 లీట‌ర్ల నీటిని మాత్ర‌మే తాగుతున్నా.. అంటే త‌గిన మోతాదులోనే తాగుతున్నా.. రోజుకు 11 సార్ల క‌న్నా ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేస్తే అప్పుడు ఆ ప‌రిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి. వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకుని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి.

ఇక మూత్రం గురించిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడ‌దు. దీని వ‌ల్ల మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు, కిడ్నీ స్టోన్స్ వ‌స్తాయి.

2. ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి మూత్రం ప‌సుపు-తెలుపు క‌ల‌గ‌లిపిన రంగులో ఉంటుంది.

3. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన్న‌ప్పుడు, ద్ర‌వాల‌ను తాగిన‌ప్పుడు మూత్రం రంగు మారుతుంది. అంతే కాదు కొన్ని సంద‌ర్భాల్లో వాస‌న కూడా వ‌స్తుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తిన్న‌ప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా, ఎలాంటి వాస‌న వ‌చ్చినా భ‌యం లేదు. అదే జంక్ ఫుడ్ వంటివి తిన్న‌ప్పుడు మూత్రం రంగు మార‌డం, దుర్వాస‌న రావ‌డం వ‌స్తే అనుమానించాలి.

4. మూత్రం తీయ‌ని వాస‌న వ‌స్తుంటే వారికి డ‌యాబెటిస్ ఉంద‌ని తెలుసుకోవాలి.

5. మూత్రంలో దాదాపు 95 శాతం వ‌ర‌కు నీరే ఉంటుంది. మిగిలిన‌ది వ్య‌ర్థ ప‌దార్థ‌మే.

6. సాధార‌ణంగా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి మూత్ర విస‌ర్జ‌న వ్య‌వ‌ధి 7 సెకండ్ల వ‌ర‌కు ఉంటుంది. అయితే ఇది వ‌య‌స్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వ‌స్తుంది.

7. వ‌య‌స్సు మీద ప‌డిన కొద్దీ మూత్ర విస‌ర్జ‌నకు త‌ర‌చూ వెళ్లాల్సి వ‌స్తుంటుంది.

Share
Editor

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM