Hari Teja : ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. అయితే హరితేజ మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతేకాదు బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ సందడి చేసింది. ఇలా యాంకర్, యాక్టర్ గా గుర్తింపు పొందిన హరితేజ బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పాల్గొంది. బిగ్ బాస్ లో హరితేజ హరికథ స్క్రిప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత హరితేజ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.
తాజాగా నవరాత్రి ధమకా అనే ప్రత్యేక కార్యక్రమంలో హరితేజ మహానటి సావిత్రిగా నటించింది. సావిత్రే నిజంగా మన కళ్లముందుకు వచ్చిందా? అనేంతలా.. హరితేజ ఆకట్టుకుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దసరా పండగ సందర్భంగా మల్లెమాల వారు నవరాత్రి ధమాకా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల తారలు ప్రేమ, సంఘవి ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మాయా బజార్ సినిమాలో సావిత్రి చేసిన పాత్రను ఈ షోలో హరితేజ చేసింది. ఇంకా సావిత్రి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా షోలో కళ్లకు కట్టినట్లుగా హరితేజ చూపించింది. ఆమె నటనకి అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. చనిపోయిన వాళ్లను గుర్తు చేయండం వేరు. నేరుగా వాళ్లే వచ్చినట్లు చేయడం వేరు. నాకు తెలిసి హరితేజ అలా చేసింది అని హైపర్ ఆది.. హరితేజను ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…