Figs : మన శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లలో అంజీర్ కూడా ఒకటి. దీనినే అత్తిపండు అని కూడా అంటారు. దీని అడుగు భాగం వెడల్పుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. అంజీరా పండ్లు ఊదా, పసుపు, గోధుమ, ఆకు పచ్చ రంగుల్లో ఉంటాయి. ఇవి పరిమాణంలో కూడా వేరువేరుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి నిల్వ చేస్తూ ఉంటారు. అంజీరా పండ్లల్లో శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏవ్యాధి బారిన పడిన వారైనా వీటిని తినవచ్చు.
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. 3 గ్రాముల అంజీరా పండులో 5 గ్రా. ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగులలో కదలికలను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులను నయం చేయడంలో, బరువు తగ్గడంలో కూడా అంజీరా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ ను, బీపీని నియంత్రించడంలో కూడా ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పండ్లను రాత్రి పాలలో నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల స్త్రీ , పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
మూలశంక వ్యాధిని నయం చేయడంలో కూడా అంజీరా పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించే గుణం కూడా అంజీరా పండ్లకు ఉంటుంది. వీటిని తినడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ అంజీరా పండ్లు ఉపయోగపడతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలోనూ అంజీరా పండ్లు దోహదపడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక అంజీరా పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్య సమ్యలు నయం అవడమే కాకుండా కొత్త అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…