Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. అయితే అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గరికపాటి అన్న మాటలను సెపరేట్ చేసి.. చిరంజీవి అన్న మాటలను వేరు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.
అదే నిజమని అంతా అనుకున్నారు.. అస్సలు ఆ తరువాత గరికపాటి చిరంజీవికి ఎంత గౌరవం ఇచ్చారు అనేది కూడా చూడాలి.. అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. మొన్నటి అలయ్ – బలయ్ కార్యక్రమంలో వాస్తవానికి చిరంజీవి తప్పు ఏమీ లేదు.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు చిరంజీవితో ఫోటో దిగడానికి మెగాస్టార్ ను వేదికకు ఒక పక్కకు పిలిచారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులు గ్రూపులుగా వచ్చి ఫోటో దిగుతున్నారు.. ఈలోపు సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింతల రామచంద్రారెడ్డి గరికపాటి నరసింహారావును మాట్లాడవలసిందిగా కోరారు.
ఇది ఫోటోలు దిగుతున్న చిరంజీవికి వినిపించలేదు. చిరంజీవి ఫోటోలు దిగుతుంది దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో అని గరికపాటికి తెలియక అభిమానులతో ఫోటో దిగుతున్నారని ఆయన చిరాకు ప్రదర్శించారు. గరికపాటికి ఇది తెలిసి చిరంజీవి వద్దకు వచ్చి ఏదో చెప్పారు.. ఆ తర్వాత తన పక్కన కూర్చోవాల్సిందిగా గరికపాటి చిరంజీవిని కోరారు. వెంటనే చిరంజీవి కుర్చీ తెప్పించుకొని ఆయన పక్కనే కూర్చున్నారు. ఇదే వేదికపై జరిగిన అసలు కథ. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉన్నారని.. ఆ ఫంక్షన్ అయ్యాక ఇద్దరూ కలిసి కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నారని.. ఆ జర్నలిస్ట్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే వివాదం ఇంతటితో ముగుస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…