Good Luck Sakhi Movie Review : మహానటి సినిమా కీర్తి సురేష్‌కు ఎంతటి పేరు తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అవలేదు. దీంతో కీర్తి సురేష్ లేడీ ఓరియెంట్ సినిమాలను ఎక్కువగా చేస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలోనే ఆమె లీడ్ రోల్‌లో తాజాగా గుడ్ లక్ సఖి అనే మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కీర్తి సురేష్‌తోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ వంటి నటులు కీలకపాత్రలను పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ..
జగపతి బాబు గుడ్ లక్ సఖి మూవీలో మాజీ కల్నల్ పాత్రను పోషించారు. ఆయన తన గ్రామంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి జాతీయ స్థాయిలో వారు రాణించాలని, వారిని చాంపియన్‌లుగా నిలబెట్టాలని ఆశిస్తుంటాడు. ఈ క్రమంలోనే సఖి (కీర్తి సురేష్)ని అందరూ దురదృష్టానికి సింబల్‌గా భావిస్తుంటారు. అయితే దురదృష్టానికి మారుపేరు అయినప్పటికీ ఆమె షూటింగ్‌లో చాంపియన్ అవడం ద్వారా ఊరికి మంచి పేరు ఎలా తీసుకువచ్చింది ? అన్నదే కథ. ఈ క్రమంలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు నగేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇందులో గోలిరాజు అకా రామారావు పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. సూరి పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
కీర్తిసురేష్ చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తెరకెక్కించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో జగపతి బాబు, ఆది పినిశెట్టిలు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఇక లీడ్ రోల్‌లో కీర్తి సురేష్ మరోమారు తన మ్యాజిక్‌ను ప్రదర్శించిందని చెప్పవచ్చు.
అయితే స్పోర్ట్స్ డ్రామా మూవీ అయినప్పటికీ, ఎంచుకున్న కథాంశం బలంగా ఉన్నప్పటికీ దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించడంలో కొన్ని చోట్ల విఫలమైనట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే గుడ్ లక్ సఖి మూవీ పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…