Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు పెళ్లి అయిన తరువాత కూడా ఆఫర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈమె మంచి ఫామ్‌ను మెయింటెయిన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సీన్లతో రెచ్చిపోయింది. దీంతో ఈమె వార్తల్లో నిలిచింది.
బాలీవుడ్‌లో భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొనే పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఈమెకు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లను అంది పుచ్చుకుంటూ ఈ బ్యూటీ ముందుకు సాగుతోంది.
దీపికా పదుకొనే లీడ్ రోల్‌లో నటించిన గెహ్రైయాన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి చెందిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అందులో దీపికా అలాంటి సీన్లలో రెచ్చిపోయింది. దీంతో ఆ సీన్స్ ను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. దీపికా ఏంటి.. పెళ్లయ్యాక మరీ ఇంతలా రెచ్చిపోయిందని ఆశ్చర్యపోతున్నారు.
కాగా గెహ్రైయాన్ ట్రైలర్ మాత్రమే కాక ఓ సాంగ్‌లోనూ దీపికా రెచ్చిపోయింది. ముద్దు సీన్లు, బెడ్ సీన్లలో నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో హీట్ పెంచింది. ఆమె ఈ విధంగా రెచ్చిపోవడం ఇదే తొలిసారి కావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
స్టార్ హీరో రణ్ వీర్ సింగ్‌తో దీపికాకు పెళ్లి అయిన విషయం విదితమే. అయితే పెళ్లయ్యాకే దీపికా ఇలా చేస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు ఆమె చేసిన పనికి సపోర్ట్‌గా నిలుస్తుంటే.. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పెళ్లయ్యాక మరీ ఇంతలా రెచ్చిపోవాలా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక ఆ సీన్లపై, నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలపై దీపికా పదుకొనే స్పందించింది. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటనా వృత్తిలో ఉన్నవాళ్లకు ఇవి మామూలే అని పేర్కొంది. దీన్ని ఇంకో కోణంలో చూడొద్దని కోరింది. కథ డిమాండ్ చేస్తే ఇలాంటి సన్నివేశాలలో నటించేందుకు అభ్యంతరం ఏముంటుందని ప్రశ్నించింది.
అయితే దీపికాకు చెందిన ఈ సీన్లపై ఆమె స్పందించిన తీరుపై రణ్ వీర్ సింగ్ ఇంకా ఎలాంటి కామెంట్లు చేయలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…