Godfather First Review : చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై రామ్ చరణ్, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ అందించాడు.
అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ మూవీ మేకర్స్ ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు మోహనరాజా తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. సినిమా పొలిటికల్ డ్రామాగా చాలా బాగుందని.. మెగాస్టార్ తన నటనతో అదరగొట్టేసాడని సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించారట.
ఇక డైరెక్టర్ మోహన్ రాజా ఇదే విషయం చెబుతూ ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఫైనల్ గా సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో సినిమా మేకర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్టోబర్ 5 న నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు పోటీగా గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే అదే రోజు మంచి విష్ణు జిన్నా సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక దసరా బరిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…