Vantalakka : తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. ఒకప్పుడు ఈ సీరియల్ స్టార్ హీరోల సినిమాలకు సైతం షాక్ ఇస్తూ.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. దీనికి కారణం వంటలక్క, డాక్టర్ బాబులు. ముఖ్యంగా వంటలక్క నటనకు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పట్టంగట్టారు. కేవలం వంటలక్క కోసమే ఈ సీరియల్స్ చూసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వాస్తవానికి ఈ కార్తీకదీపం అనే సీరియల్ మళయాళ కరతముత్తు కు రీమేక్. అందులో వంటలక్కగా నటించినామె నటన నచ్చి తెలుగులో కూడా ఆ పాత్రకు ఆమెనే సెలెక్ట్ చేశారు.
ఈ వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కేరళలోని ఎర్నాకులం ఎడప్పల్లిలో పుట్టిన ప్రేమి ఎల్ఎల్ బీ కంప్లీట్ చేసి కొంతకాలం పాటు లీగల్ అడ్వైజర్ గా చేసింది. ఫోటోగ్రఫీ మీద ఇంట్రస్ట్ తో ఫోటోగ్రఫీ నేర్చుకొని కొన్ని పెళ్లిళ్లకు తన టీమ్ తో పని చేసింది. తర్వాత మోడలింగ్ కూడా చేసింది. అలా మోడలింగ్ చేస్తున్నప్పుడే కరతముత్తు సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో ప్రేమీ పేరు మార్మోగింది. ముఖ్యంగా ఆ కళ్లతో ఆమె పలికించిన హావాభావాలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.
అదే సీరియల్ ను తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఆ పాత్రకు ప్రేమీ అయితేనే న్యాయం చేయగలదని భావించి ఆమెనే కార్తీకదీపంలో వంటలక్కగా తెలుగులో పరిచయం చేశారు. ఇక్కడ వంటలక్కకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మధ్య వంటలక్క క్యారెక్టర్ చనిపోతే రేటింగ్ కూడా అమాంతం పడిపోయింది. దీంతో చేసేది లేక సీరియల్ కు క్రేజ్ ను తీసుకుని రావడానికి సీరియల్ దర్శకుడు మళ్ళీ దీప, కార్తీలు బతికున్నట్టు చూపిస్తున్నారు. ప్రేమి భర్త వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డును అందుకున్నాడు. ప్రేమిది లవ్ మ్యారేజ్ కావడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…