Godfather 1st Day Collections : గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టుగానే భావిస్తున్నారు. ఆచార్య లాంటి ఘోరమైన ఫ్లాప్ తరువాత గాడ్ ఫాదర్ సినిమా ఆయనకు కాస్త రిలీఫ్ ఇచ్చిందని అంటున్నారు. ఒక పక్క రీమేక్ సినిమా అయ్యి ఉండి, లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ అంతగా ప్రచారం లేకపోయినా మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సినీ ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారాన్ని బట్టి గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజైన బుధవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది. యూఎస్ లో ప్రీమియర్ షోల కలెక్షన్లు కూడా కలిపి ఈ మొత్తం సాధించినట్టుగా చెబుతున్నారు. ఇక సీమ ఏరియాలో బ్లాక్ బస్టర్ మాస్ హిట్ గా నిలిచిందని అంటున్నారు. చిరంజీవి కెరీర్ లోనే వసూళ్ల పరంగా భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుందని, బాస్ ఈజ్ బ్యాక్ అని అభివర్ణిస్తున్నారు.
నయనతార, సత్యదేవ్ తమ క్యారెక్టర్లలో అద్భుతంగా చేశారని, సల్మాన్ ఖాన్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాడని అని విశ్లేషిస్తున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ పబ్లిసిటీతోపాటు వరుస సెలవులు రావడంతో మంచి ప్రారంభ వసూళ్లు దక్కాయని అభిప్రాయ పడుతున్నారు. ఇంకా హాలిడేస్ మిగిలి ఉండడంతో రానున్న రోజుల్లో ఇంకా పుంజుకుంటుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…