Airtel 5G : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు ముందుగా పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను అందిస్తామని ప్రకటించాయి. ఇక జియో 4 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించగా.. ఎయిర్‌టెల్ తాజాగా 8 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ఎయిర్‌టెల్ 5జి సేవలు 8 నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి ప్రాంతాల్లో 5జి సేవలను ప్రారంభించామని ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5జి సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలియజేసింది. అయితే 5జి సేవలను పొందాలంటే ప్రస్తుతం ఉన్న 4జి సిమ్‌లను మార్చాల్సిన పనిలేదని.. 5జి టెక్నాలజీని ఇప్పటికే ప్రస్తుతం ఉన్న సిమ్‌లు కలిగి ఉన్నాయని.. కనుక సిమ్ మార్చకుండానే వినియోగదారులు 5జి సేవలను పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలియజేసింది.
అయితే 5జి సేవలను పొందాలంటే.. వినియోగదారులు 5జిని సపోర్ట్ చేసే ఫోన్‌ను కలిగి ఉండాలి. ఇక హైదరాబాద్‌లో ఉన్న ఎయిర్‌టెల్ వినియోగదారులు ప్రస్తుతం తమ 5జి ఫోన్లలో 5జి సేవలను పొందవచ్చు. కాగా ఈ ఏడాది చివరి వరకు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జి ని అందిస్తామని, వచ్చే ఏడాది మార్చి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జి సేవలు లభిస్తాయని.. ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక 5జి టెక్నాలజీ వల్ల ప్రస్తుతం వాడుతున్న 4జి కన్నా వినియోగదారులు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందవచ్చు. దీంతో పనులను వేగంగా చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…