Tanya Ravichandran : తాన్యా రవిచంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. హీరో కార్తికేయతో రాజా విక్రమార్క అనే చిత్రంలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలుగా నటించడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈమెపై పడింది. మంచి అభినయంతోపాటు చక్కని అందం ఆమె సొంతం అవడంతో అంతా ఆమె గురించి ఆరా తీస్తున్నారు.
తాన్యా రవిచంద్రన్ అసలు పేరు అభిరామి శ్రీరామ్. తమిళ దర్శకుడు మిస్కిన్ ఈమెకు ఆ పేరును సూచించాడు. సీనియర్ తమిళ నటుడు రవిచంద్రన్ కి మనవరాలు. తన వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. చెన్నైలో 1996 జూన్ 20 న శ్రీరామ్, లావణ్య దంపతులకు జన్మించింది. తన తల్లి లావణ్య దగ్గర భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె తమిళంలో 6 సినిమాల్లో నటించింది. బల్లే వేళ్లాయెదేవా అనే సినిమా తమిళంలో తను నటించగా విడుదలైన మొదటి చిత్రం.
2017లో విజయ్ సేతుపతి, బాబీసింహ లాంటి వారితో కలిసి తాన్యా నటించిన కరుప్పన్ అనే మూవీ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. హీరో కార్తికేయ సినిమా రాజా విక్రమార్కతో తెలుగులో తెరంగేట్రం చేసింది. కానీ అంతగా పాపులర్ అవ్వలేదు. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలుగా చేయడంతో ఒక్క సారిగా అందరి దృష్టి ఈమెపై పడింది. ఈ చిత్రంలో ఆమె మంచి నటనను కనబరిచిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయని పలువురు తన భవిష్యత్తును తెలుపుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…