Getup Srinu : ఆచార్య ఫ్లాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌నే రాబడుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ లభించింది. దీంతో చిరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దీని వల్ల ఆచార్య ఫ్లాప్ నుంచి బయట పడవచ్చని భావిస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ హిట్ కావడంతో చిరంజీవికి కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు.
ఇక జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను గాడ్ ఫాదర్ లో నటించాడు. శ్రీనుకి చిరంజీవి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. గెటప్ శ్రీను కూడా ఈ సినిమా బాగా హిట్ అవుతుందని మెగా అభిమానులకు చొక్కాలు చింపుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. ఇంతకీ గెటప్ శ్రీను ఈ సినిమాలో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా. రూ.10 లక్షల వరకు అతను రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెటప్ శ్రీను చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు.
ఒక ఆడియన్ గా నేను చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అన్నయ్యకు నేను పెద్ద అభిమానిని. మెగాస్టార్ ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎందరో ఇండస్ట్రీకి చిరంజీవిని ప్రేరణగా తీసుకొని వస్తున్నారని.. అలాంటి వారికి చిరంజీవి ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్నారని.. గెటప్ శీను తనదైన శైలిలో చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం నాకు రావడం నిజంగా పెద్ద అచీవ్‌మెంట్ అంటూ గెటప్ శ్రీను ఎమోషనల్ అయ్యాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…