Nikesha Patel : ఆర్ఆర్ఆర్ మూవీ బాగాలేద‌న్న ప‌వ‌న్ హీరోయిన్‌.. ఆడుకుంటున్న ఫ్యాన్స్‌..!

Nikesha Patel : ఒకప్పటి రోజుల్లో  సినిమా 100 రోజులు థియేటర్లో ఆడిందంటే ఆ సినిమాను సూపర్ హిట్ సినిమాగా గుర్తించేవారు. కంటెంట్ బాగుంటే సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకునేది. కానీ ఇప్పటి రోజుల్లో ఒక చిత్రం కంటెంట్ ఎంత బాగున్న కూడా థియేటర్లలో మూడు, నాలుగు వారాల కన్నా ఎక్కువ ఉండటం లేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మించి కలెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దాని సక్సెస్ ఫుల్ చిత్రంగా లెక్క కడుతున్నారు.

ఇక ఓవరాల్ కలెక్షన్స్ ని లెక్క పెట్టేసి ఓటీటీకి విక్రయిస్తున్నారు దర్శకనిర్మాతలు. మొదటి వారాల్లోనే తప్ప ఆ తర్వాత చిత్రం విడుదలైన సంగతి కూడా దాదాపు అందరూ మర్చిపోతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకోవడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది మార్చి 24న విడుదలైంది. అంటే సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు అయిపోయింది. కానీ ఈ సినిమాని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. హీరోలు ఇద్దరు కూడా తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందారు.

Nikesha Patel

ఈ సినిమా ఎంత ప్రేక్షకాదరణ పొందిన సినిమా అయినా కూడా కొంత మందికి నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించడానికి కొంత మంది సంకోచిస్తారు. కానీ పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ నిఖిషా పటేల్ మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా.. తాను ఆర్ఆర్ఆర్  సినిమా చూశానని, తనకు ఆ సినిమా నచ్చలేదని ట్వీట్ చేసింది. చూసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని ఏమీ లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నాకు నచ్చలేదు అని చెప్పాలనిపించి చెప్పేశా.. అని తన అభిప్రాయాన్ని ట్వీట్‌లో నిఖిషా పేర్కొంది.

ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఊరుకుంటారా..  నిఖిషాను ఆడుకోవడం మొదలు పెట్టారు. నీకు నచ్చకపోతే ఇప్పుడు ఎవడికి కావాలి. నీ అభిప్రాయం ఎవడు అడిగాడు. నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నిఖిషాను కామెంట్స్ రూపంలో ఆడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా నిఖిషా పటేల్ అటెన్షన్ కోసమే ఈ విధంగా ట్వీట్ చేసిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. నిఖిషా పటేల్ బ్రిటిష్ సిటిజన్ కాబట్టే ఆమెకు ఈ సినిమా నచ్చలేదని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిఖిషా పటేల్ పవన్ కళ్యాణ్ సరసన పులి చిత్రంలోనూ, హీరో కళ్యాణ్ రామ్ సరసన ఓం 3డి చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రాలు రెండూ కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కనిపించలేదు నిఖిషా. దాదాపు తెలుగు ప్రజలందరూ కూడా నిఖిషా అనే హీరోయిన్ ఉందనే సంగతి కూడా మర్చిపోయారు. ఇప్పుడు నిఖిషా పటేల్ ఈ ఒక్క ట్వీట్ ద్వారా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM