Gangotri Movie : టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు పుష్ప సినిమాతో ఏ రేంజ్‌లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బన్నీ ఇప్పుడు ఇంత స్టార్ అయ్యాడు అంటే అందుకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ లో నటుడిని ప్రోత్సహించింది చిరంజీవి అని అందరికి తెలిసిందే. గంగోత్రి సినిమాతో బన్నీ కెరీర్ ప్రారంభించగా, ఈ సినిమా ఆఫర్ బన్నీకి ఎలా వచ్చింది అనే వివరాలను నాగబాబు తాజాగా వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ గా ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తున్న రామ్ చరణ్ హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సిన సినిమా గంగోత్రి. కానీ అప్పుడే చరణ్ కి మెచ్యూరిటీ రాలేదని.. ఇంకా ట్రైనింగ్ కావాలని చెబుతూ.. ఆ ప్రాజెక్టును బన్నీ చేయాలని కోరారట చిరంజీవి. అలా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఈ విషయాలను ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. మా కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వస్తారని.. హీరోలు అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో ఎలా అయితే అన్నయ్యను చూసి ఇన్ స్పైర్ అయ్యి హీరోలు అయ్యారో.. అలాగే మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆయన స్పూర్తితోనే హీరోలు అయ్యారు అని నాగబాబు అన్నారు.
చిరంజీవి స్పూర్తితో హీరోగా కావాలని అనుకున్న వాళ్లలో బన్నీ కూడా ఒకరు అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. పుష్ప తో అందరి దృష్టిని ఆకర్షించిన బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూట్ కొనసాగుతోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారని టాక్ . వీలైనంత త్వరగా ఈ సినిమా విడుదల చేయాలని సుకుమార్, చిత్రబృందం చూస్తుండగా, వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…