Ragi Laddu : ఈ ల‌డ్డూలు ఎంత బ‌లం అంటే.. రోజుకు ఒక‌టి తినాలి.. ఏ రోగ‌మూ ఉండ‌దు..

Ragi Laddu : మ‌నం చిరు ధాన్యాల‌యిన‌టు వంటి రాగుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది రాగుల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని త‌యారు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా రాగి ల‌డ్డూల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ల‌డ్డూల‌ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

రాగి పిండి – 250 గ్రా., పల్లీలు – 50 గ్రా., బెల్లం – 250 గ్రా., యాల‌కుల పొడి – చిటికెడు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 100 ఎంఎల్.

Ragi Laddu

రాగి ల‌డ్డూల‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక రాగిపిండిని వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు చిన్న మంట‌పై వేయించుకోవాలి. త‌రువాత ప‌ల్లీల‌ను కూడా వేసి వేయించి పొట్టు తీయాలి. ఈ ప‌ల్లీల‌ను ఒక జార్ లో వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా ప‌లుకుగా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా క‌ళాయిలో బెల్లాన్ని , నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగి త‌రువాత వ‌డ‌పోసి మ‌ర‌లా తీగ‌పాకం వ‌చ్చే వ‌ర‌కు వేడి చేయాలి.

బెల్లం పాకం వ‌చ్చిన త‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టిన ప‌ల్లీల‌ను, రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్ల‌గా అయ్యి గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు చేతికి నెయ్యిని రాసుకుంటూ త‌గిన ప‌రిమాణంలో పిండిని తీసుకుంటూ ఉండ‌లుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రాగి ల‌డ్డూల‌ను రోజుకి ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల రాగుల్లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM