Rajamouli : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే ఆయన చిత్ర యూనిట్‌తో కలిసి ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో నాగచైతన్య కూడా ఒక కీలకపాత్రలో నటించాడు. చైతూ రోల్ ఈ మూవీలో 15 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ మూవీ వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు రిలీజ్ కానుంది.
ఇక లాల్ సింగ్ చడ్డా మూవీకి గాను తాజాగా పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలకు అమీర్ ఖాన్ స్పెషల్ షో వేయించారు. ఈ షోకు దర్శకులు రాజమౌళి, సుకుమార్‌లతోపాటు చిరంజీవి, చైతూలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారు ఈ మూవీని చూస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రూ.వందల కోట్లు పెట్టిన తీసిన సినిమాలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. బాయ్‌కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను సినిమా రిలీజ్ అయినప్పుడల్లా అక్కడి ప్రేక్షకులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ వర్గాలు సినిమాలను రిలీజ్ చేయాలంటేనే వణికిపోతున్నాయి. అయితే ఈ మూవీని ముందుగానే రాజమౌళి, సుకుమార్‌లతోపాటు చిరంజీవి వంటి స్టార్స్‌కు చూపిస్తే వారు ఏమైనా సలహాలు ఇస్తే.. చివరి నిమిషంలో సినిమాలో మార్పులు చేయవచ్చు కదా.. దీంతో సినిమాకు ఫ్లాప్ టాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూసేలా వారిని థియేటర్లకు రప్పించవచ్చు.. అని అమీర్‌ఖాన్ అనుకున్నారు. అందుకనే ఆయన రాజమౌళి, సుకుమార్ లతోపాటు చిరంజీవిని ఆహ్వానించి వారికి ఈ మూవీ స్పెషల్ షోను వేసి చూపించారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, జోకులు పేలుతున్నాయి. రాజమౌళికి, చిరంజీవికి సినిమా చూపించారు సరే. కానీ రాజమౌళి ఇచ్చే సలహాలను పాటిస్తే సినిమా హిట్ అవుతుంది.. కానీ చిరంజీవి ఇచ్చే సలహాలను పాటిస్తే మాత్రం అమీర్‌ఖాన్ బుగ్గిపాలు అవుతాడని.. కనుక రాజమౌళి సలహాలనే పాటించాలని.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య వార్ నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…