Upasana : ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. చాలా మంది పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు.. వారి కుటుంబాలకు చెందిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో రామ్‌చరణ్, ఉపాసనల గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వారు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. అందుకు కారణం కూడా ఉందని.. అనేక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలపై ఉపాసన స్పందించింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో ఉపాసన మాట్లాడింది. మీరు పిల్లల్ని కనడం లేదంటే అందుకు మిమ్మల్ని అభినందించవచ్చు.. అని ఆయన అన్నారు. అయితే ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపాసన తెలియజేసింది. సద్గురు అన్న వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఉపాసన స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. జనాభా పెరిగిపోవడం వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని చూసిన ఉపాసన ఇలా స్పందించింది. ఇదేదీ నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి, నా కామెంట్స్‌ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దయచేసి ఆ రోజు సద్గురుతో నేను ఏం మాట్లాడానో మరొకసారి ఆ వీడియోలో చూసి తెలుసుకోండి, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి.. అంటూ ఉపాసన పోస్ట్ పెట్టింది.
ఇలా ఉపాసన పోస్ట్ పెట్టడంతో వారు పిల్లల్ని కనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టమైంది. కానీ మరి 10 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు ఆ కలను వారు ఎందుకు నిజం చేసుకోలేదు.. అన్న ప్రశ్న మాత్రం మళ్లీ ఉత్పన్నమవుతోంది. అయితే దీనికి మళ్లీ ఆమె సమాధానం చెబుతుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…