Naga Chaitanya : బంగార్రాజు మూవీ సక్సెస్ అనంతరం నాగచైతన్య మన ముందుకు థాంక్ యూ అనే మూవీతో వస్తున్న విషయం విదితమే. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు చైతూ పక్కన యాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతూ ఈ మూవీలో అభిరామ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఇటీవలే చైతూ, రాశిఖన్నా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక ఇప్పుడు దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఈ మూవీకి సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.
థాంక్ యూ మూవీలో నాగచైతన్య మూడు రకాలుగా కనిపిస్తాడు. 16 ఏళ్లు, 22 ఏళ్లు, 34 ఏళ్ల వయస్సులో ఎలా ఉండాలో అతను అచ్చం అలాగే కనిపిస్తాడు. అయితే ఇందుకు ఎలాంటి మేకప్ లేదా గ్రాఫిక్స్‌ను వాడలేదు. మరి అంత తక్కువ వయస్సు ఉన్న వాడిలా ఎలా కనిపించాడు.. అంటే.. అతనే కష్టపడ్డాడు. 50 రోజుల పాటు ప్రత్యేక డైట్‌ను పాటించి బరువు బాగా తగ్గాడు. దీంతో 16 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. సినిమా కోసం చైతన్య ఎంత కష్టపడతాడో ఈ ఒక్క సంఘటన చాలు.. అంటూ దర్శకుడు విక్రమ్ తెలిపారు.
అలాగే 22, 34 ఏళ్ల వయస్సులలో ఉన్నవాడిలా కనిపించేందుకు కూడా చైతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని దర్శకుడు వివరించారు. కనుక సినిమాలో చైతూను మూడు భిన్న రకాల గెటప్‌లలో చూడవచ్చన్నారు. ఇక ఈ మూవీకి బీవీఎస్ రవి రచయిత కాగా ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…