Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి అంత కాకపోయినా.. భారీ రేంజ్‌లో అయితే హిట్ అయింది. ఈ క్రమంలోనే రాజమౌళి ఇంకో మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ మూవీకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓటీటీలోనూ ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనాలను సృష్టిస్తోంది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఇంతటి ఘన విజయాన్ని సాధించినా రాజమౌళి మాత్రం ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా సైలెంట్ గానే ఉన్నారు. అదే ఇతర దర్శకులు అయితే తమ మూవీ ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తే సక్సెస్ పార్టీల్లో మునిగి తేలేవారు. ఒక రేంజ్‌లో పార్టీలు జరుపుకునేవారు. కానీ రాజమౌళి సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక ఈ మధ్యే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు. అయితే రాజమౌళి దీనిపై కూడా ఒక్క మాట అయినా మాట్లాడలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో రాజమౌళికి ఏమైందని అందరూ అనుకుంటున్నారు.

రాజమౌళి ఇన్ని ఘనతలను సాధిస్తున్నా సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారు. ఏదైనా మాట్లాడొచ్చు కదా.. ఇప్పటికైనా నోరు విప్పండి.. ప్లీజ్.. అని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే వాస్తవానికి రాజమౌళి ఇప్పుడు కాదు.. ఎప్పుడూ అంతే.. ఎల్లప్పుడూ ఆయన నిరాడంబరంగానే ఉంటారు. ఆడంబరాలను ప్రదర్శించరు. పార్టీలు, పబ్‌లు అంటే ఆయనకు నచ్చవు. అందుకనే ఆయన అంతటి విజయాలను సాధిస్తున్నా సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక రాజమౌళి త్వరలోనే మహేష్‌తో కలసి సినిమా చేయనున్నారు. 2023లో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.