Actor Vikram : ప్రముఖ కోలీవుడ్ స్టార్ విక్రమ్‌కు గుండె పోటు వచ్చింది. ఆయన సడెన్ గా గుండె పోటుకు గురి కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. కాగా ఆయన పొన్నియిన్ సెల్వన్ చిత్రం ట్రైలర్ లాంచింగ్‌కు గురువారం సాయంత్రం హాజరు కావల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటు బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
విక్రమ్ తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించారు. శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన అపరిచితుడు సినిమాకు గాను ఆయనకు ఎంతగానో పేరు వచ్చింది. ఆయన తన తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో కలసి చేసిన మహాన్ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఆయన ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్‌తోపాటు పలు ఇతర చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మూవీలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కార్తి, జయం రవి, శరత్ కుమార్, త్రిష తదితర ప్రముఖులు నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ కానుంది. అలాగే కోబ్రా అనే మరో మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. దీంట్లో ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కేఎస్ రవికుమార్, మియా జార్జ్ తదితరులు నటించారు. దీనికి ఇమైక్క నోడిగల్ ఫేమ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.