F3 : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల్ని ఎంతగా నవ్వించిందో అంతకుమించిన ‘ఫన్’ పంచేందుకు ‘ఎఫ్ 3’ సిద్ధమవుతోంది.
ప్రముఖ నటుడు సునీల్ రాకతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన సోనాల్ చౌహాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సినిమా నవ్వుల విందును పంచడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితోపాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఎఫ్ 3 సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేమిటి.. అనేది ఈ సినిమా కథ అంటున్నారు.
అప్పులు తీర్చడానికి పడే తిప్పలను ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో వరుణ్ చేతిలో డబ్బులు పట్టుకొని ఉండగా, వెంకటేష్ గోల్డ్ పట్టుకున్నాడు. బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే మనకు నవ్వుల పండగ అని మేకర్స్ ఇప్పటికే ఒక ప్రకటన చేయగా, డబ్బుల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…