Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్రయత్నం కావడంతో అందరిలోనూ తెలియని ఓ చిన్న టెన్షన్ కూడా ఉంది.
ఇప్పటికే పుష్ప చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘సామి సామి’ అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో 13 మిలియన్ వ్యూస్ ను దాటింది ఈ పాట.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలో ఓ సాంగ్ వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించబడిందని తెలియజేశారు. వెండితెరపై ఇది ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…