Evaru Meelo Koteeswarulu : వెండితెరపై రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ బుల్లితెరపై ఆకట్టుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్ తొలి సీజన్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్ రెండో సీజన్‌కి బైబై చెప్పాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో రీఎంట్రీ ఇచ్చాడు జూనియర్. ఈ షోలో ఎన్టీఆర్ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నప్పటికీ షో పెద్దగా అలరించలేకపోతోంది.
మా టీవీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత జీ, ఈటీవీ ఉన్నాయి. జెమిని 4 వ స్థానంలో ఉంది. దాని రేటింగ్‌లను మెరుగుపరచాలనే లక్ష్యంతో మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే రెండు కార్యక్రమాలు విఫలమయ్యాయి.
రెండు మూడు వారాలకు రేటింగ్స్ బాగానే ఉన్నా.. రాను రాను ఈ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి. బిగ్‌బాస్ షో రేటింగ్స్‌తో అదరగొట్టిన తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌తో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. దీపావళి రోజున మహేష్ బాబు హాజరు కానున్నారు.
అయితే ఇక ముందు ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించలేకపోవచ్చనే టాక్ వినబడుతోంది. షో పెద్దగా ఆశాజనకంగా లేని కారణంగా ఎన్టీఆర్ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఆయన నో చెబుతున్నట్టు తెలుస్తోంది.