Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి రాజా రవీంద్ర మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. చాలా ధైర్యంగా ఆడుతూ వచ్చిన రాజా రవీంద్ర చివరి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి విజేతగా నిలిచాడు. కోటి రూపాయలను గెలుచుకున్న కంటెస్టెంట్‌కు ఇచ్చే చెక్‌పై సంతకం చేసే అదృష్టం కలిగింది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
చెక్ ఇచ్చే ముందు రాజా రవీంద్ర భార్య సింధూజను వేదికపైకి పిలిచారు. రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకోవడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. మీ భర్తకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. అని అడిగితే.. బావ ఐ లవ్ యూ.. అంటూ సింధూజ తన ప్రేమను, ఆనందాన్ని వ్యక్తంచేసింది.
దాంతో ఎన్టీఆర్ అదే మాటను మళ్లీ చెప్పించారు. మీకు చెక్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఉంది అంటే.. మీ చేతుల మీదుగా ఈ చెక్‌ను అందుకోవడం గర్వంగా ఉంది అని రాజా రవీంద్ర దంపతులు అన్నారు.
అయితే కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్రకు నిబంధనల ప్రకారం దక్కేది మాత్రం తక్కువే. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎవరైనా ఓ టీవీ షోలో రూ.10,000 మించి ప్రైజ్ మనీ గెలుచుకుంటే 31.2 శాతం టాక్స్ చెల్లించాలి. దీని ప్రకారం రాజా రవీంద్రకు కేవలం రూ. 68.80 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. టాక్స్ మినహాయించుకొని, మిగిలిన అమౌంట్ విన్నర్ కి ఇస్తారు. రూ.31,20,000 పన్ను రూపంలో కోల్పోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…