Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. బుల్లితెరపై బిగ్ బాస్ షోతో అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో చేస్తున్నారు. ఇక్కడ మనీతోపాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ ఈ షోపై ఆసక్తి రేకెత్తించారు ఎన్టీఆర్.
రామ్ చరణ్ తో మొదలైన ఈ షో మహేష్ తో పూర్తి కానుందని సమాచారం. నవంబర్ 18 ఎపిసోడ్ తో షోని ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుతో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ చేసి నెల రోజులు దాటింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. అయితే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు తెలుస్తోంది.
జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం.
కోటి రూపాయల ప్రశ్నని ఎన్టీఆర్ సంధించడం, ఆయన దానిని ఫిక్స్ చేయమనడం జరిగినట్టు ప్రోమోలో చూపించారు. రాజా రవీంద్ర సరైన సమాధానం చెప్పడంతో ఆయన కోటి గెలుచుకున్నట్టు తెలుస్తోంది. షో రేపు రాత్రి ప్రసారం కానుంది.
https://twitter.com/GeminiTV/status/1459742894298832898?s=20