Dussehra 2022 Muhurat : ద‌స‌రా రోజు మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది అంటే.. ఆ రోజు ఇలా చేస్తే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Dussehra 2022 Muhurat : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు జ‌రుపుకునే అనేక పండుల్లో ద‌స‌రా ఒక‌టి. అయితే ఇది అతి పెద్ద పండుగ అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులు ద‌స‌రాను వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. బ‌తుక‌మ్మ పండుగ‌ను కూడా ఇదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున జ‌రుపుకుంటారు. ఇక దేశంలో అనేక చోట్ల 9 రోజుల పాటు దుర్గామాత విగ్ర‌హాల‌ను పూజించి ఆ త‌రువాత నిమ‌జ్జ‌నం చేస్తారు. చివ‌రి రోజును విజ‌య‌ద‌శ‌మి లేదా ద‌స‌రాగా జ‌రుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మ‌వారు వివిధ రూపాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఇక ద‌స‌రా పండుగ రోజు చాలా మంది కొత్త వ్యాపారాల‌ను, ప‌నుల‌ను ప్రారంభిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. అదే రోజు రాముడు రావ‌ణాసురుడిపై యుద్ధం చేసి విజ‌యం సాధించాడు. అలాగే పాండ‌వులు కూడా యుద్ధంలో కౌర‌వుల‌పై గెలుపొందారు. దీంతోపాటు దుర్గాదేవి కూడా రాక్ష‌స సంహారం చేసింది అదే రోజు. క‌నుక ఆ రోజు ఎవ‌రు ఏం చేసినా స‌రే.. క‌ల‌సి వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తారు. అందుక‌నే ద‌స‌రాను విజ‌యాలు చేకూర్చే విజ‌య‌ద‌శ‌మిగా జ‌రుపుకుంటుంటారు.

Dussehra 2022 Muhurat

ఇక ఈసారి ద‌స‌రా పండుగ అక్టోబ‌ర్ 5న వ‌చ్చింది. కానీ శుభ ముహుర్తం మాత్రం అక్టోబ‌ర్ 4 నుంచే ఉంది. అక్టోబ‌ర్ 4వ తేదీన రాత్రి 10.51 గంట‌ల నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ రాత్రి 9.15 గంట‌ల వ‌ర‌కు ద‌స‌రా ముహుర్తం ఉంది. ఇక అమృత కాలం మాత్రం అక్టోబ‌ర్ 5వ తేదీన ఉద‌యం 11.33 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.02 గంట‌ల వ‌ర‌కు ఉంది. క‌నుక ఎవ‌రైనా ఏం చేయాల‌న్నా స‌రే.. ఈ స‌మ‌యంలో చేస్తే.. అంతా మంచే జ‌రుగుతుంది.

ఇక ద‌స‌రా రోజు ఉద‌యాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కుటుంబం మొత్తం త‌ల‌స్నానం చేయాలి. అనంత‌రం దుర్గామాత‌కు పూజ చేయాలి. ముఖ్యంగా బెల్లం, అర‌టి పండ్లు, బియ్యంను పూజ‌లో త‌ప్ప‌క ఉంచాలి. అనంత‌రం వీటిని పేద‌ల‌కు లేదా బ్రాహ్మ‌ణుల‌కు దానం చేయాలి. వారికి ఇవే కాకుండా ఏవైనా ఇత‌ర వ‌స్తువులు లేదా ఆహారాలు కూడా దానం చేయ‌వ‌చ్చు. త‌రువాత పెద్ద‌ల ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా ద‌స‌రా శుభ ముహుర్తం స‌మ‌యంలో చేస్తే.. అంతా మంచే జ‌రుగుతుంది. ఎవ‌రైనా ఏం వ్యాపారం మొద‌లు పెట్టినా స‌రే క‌ల‌సి వ‌స్తుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ఇంట్లోని అంద‌రూ సుఖ సంతోషాల‌తో జీవ‌నం సాగిస్తారు. క‌నుక ద‌స‌రా రోజు ఇలా చేయ‌డం మ‌రిచిపోకండి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM