Drushyam 2 Movie Review : దృశ్యం 2 రివ్యూ.. ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో సాగిన థ్రిల్ల‌ర్‌..!

Drushyam 2 Movie Review : వైవిధ్య‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న వెంక‌టేష్ ఇటీవ‌ల త‌న చిత్రాల‌ను ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేస్తున్నారు. నార‌ప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసిన వెంకీ ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మీనా, కృతిక, ఎస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

2014లో వచ్చిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘దృశ్యం’కి రీమేక్ గా తెర‌కెక్కిన దృశ్యం 2లో రాంబాబుగా వెంకటేశ్‌ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు ? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తెలియాలంటే ‘దృశ్యం2’ చూడాల్సిందే! రాంబాబు (వెంకటేష్), వరుణ్ (నదియా కొడుకు) మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెట్టేసి, ఆ హత్య కేసులో ఎలాంటి క్లూ లేకుండా చేస్తాడు. ఆరేళ్లు గడుస్తున్నా వరుణ్ తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరు చంపారో తెలియక చస్తూ బతుకుంటారు. ఈ కేసులో రాంబాబుకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలను సేకరించి అతనిని అరెస్టు చేయడానికి పోలీస్ ఆఫీసర్ (సంపత్)ని నియమిస్తారు. ఈ సారి రాంబాబు ఎలా కాపాడుకుంటాడు.. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్ . ఇప్పటికే మలయాళంలో విడుదలైన చిత్రమే అయినా, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఫ్రెష్‌లుక్‌తో సినిమాను తీర్చిదిద్దాడు. వరుణ్‌ మిస్సింగ్‌ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు భయాలతో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది చూపించాడు. వెంకీ తన కళ్లతో అద్భుతంగా ఎమోషన్స్‌ని పలికిస్తూనే, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మీనా ఈ సారి మంచి స్క్రీన్ స్పేస్‌ని పంచుకోవడంతో తన సపోర్టింగ్ రోల్‌ను పర్ఫెక్ట్‌గా పోషించింది. మిగ‌తా వారంద‌రూ త‌మ పాత్ర మేర న‌టించారు.

సినిమా స్లో మోషన్‌లో ప్రారంభం కావడం, కాసేపు కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు కొందరికి బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్‌లో పరిచయం చేసిన పాత్రలకు అసలైన ప్రయోజనం ఏమిటనేది చివరలో తెలుస్తుంది. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కొన్ని కీలక ఎమోషన్స్ దగ్గర తాను ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ మంచి ఎఫెక్టివ్‌ గా కూడా ఉంది.‘దృశ్యం 2’ సినిమా కచ్చితంగా అన్ని అంచనాలను అందుకుందనే చెప్పాలి. క్లీన్ అండ్ గ్రిప్పింగ్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM