Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక దీ..ప మోనితను అందరి ముందు గట్టిగా నిలదీస్తుంది. ల్యాబ్ లో దొంగతనంగా శాంపిల్స్ తీసుకుంది అనడంతో మోనిత టెన్షన్ పడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ దీపక్క అంటూ ఈ తాళిబొట్టు నేనే కట్టుకున్నానని అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇది సహజ గర్భం అని మోనిత చెప్పడానికి ప్రయత్నించగా వెంటనే దీప.. మోనితకు జలక్ ఇచ్చింది.
తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను ప్రియమణితో తెప్పించి అందులో మోనిత శాంపిల్స్ తీసుకున్నట్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతారు. మోనిత ఇదంతా అబద్ధమని చెప్పగా ల్యాబ్ లో టెక్నీషియన్ తో మాట్లాడిన మోనిత నిజస్వరూపం వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూడటంతో మోనిత షాక్ అవుతూ బారసాలకి వచ్చిన గెస్టు లందరినీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. మోనిత తన నిజస్వరూపం బయట పడ్డా కూడా మళ్లీ దీపకు వార్నింగ్ ఇస్తుండగా సౌందర్య వచ్చి ఆమె చెంప పగలగొడుతుంది.
మోనితకు వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి దీపను తీసుకొని వెళుతుంది. కార్తీక్ ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉండగా దీప వచ్చి కాసేపు మాట్లాడుతుంది. ఇక దీప ధైర్యాన్ని, గొప్పదనాన్ని పొగుడుతాడు కార్తీక్. ప్రియమణి ఇంట్లో ఉండగా ఓ లాయర్ వచ్చి మోనితను పిలవమని అడుగుతాడు. ప్రియమణి మాత్రం ఆలోచనలో పడుతుంది. మళ్ళీ దీప కుటుంబాన్ని ఏం చేస్తుందో ఈ మోనితమ్మ అని అనుకుంటుంది.
ఇంట్లో దీప కుటుంబం అంతా ఓ దగ్గర కూర్చొని సంతోషంగా కబుర్లు పెట్టుకుంటారు. అందులో సౌందర్య మాత్రం కనిపించదు. ఇక దీప పిల్లలకు పొడుపు కథలు వేస్తూ సరదాగా కనిపిస్తుంది. మొత్తానికి కార్తీక్ కుటుంబంలో మళ్లీ సంతోషం కనిపిస్తుంది. ఓవైపు మోనిత ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ బారసాల వేడుకలో దీప.. మోనితకు అందరి ముందు ఇచ్చిన జలక్ మాత్రం.. మోనితకు పట్టపగలే చుక్కలు చూపించిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…