Rashmi Gautam : ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు కేవలం సినిమా అవకాశాల కోసమే చూడడం లేదు. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చినా సరే చేస్తున్నారు తప్ప వదులుకోవడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది.
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసే విషయానికి వస్తే తమన్నా ఆ జాబితాలో ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యే సమంత పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఒక ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత ఏకంగా రూ.1.50 కోట్లు తీసుకోబోతుందని సమాచారం. అయితే బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి గౌతమ్‌ను ఓ ఆఫర్ వరించింది. ఆమె మెగాస్టార్ పక్కన డ్యాన్స్ చేసే చాన్స్ కొట్టేసింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం రష్మి గౌతమ్‌ను తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఆమె త్వరలో ఈ మూవీలో ఓ పాటలో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయనుంది. ఈమేరకు రష్మి గౌతమ్ తన అంగీకారం కూడా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆమె ఐటమ్ సాంగ్‌లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…