Drushyam 2 : వెంకటేష్, మీనా నటించిన తాజా చిత్రం దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. మళయాళం సినిమా రీమేక్ అయిన దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చిత్ర నిర్మాత అయిన సురేష్ బాబుకు లీగల్ కష్టాలు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సురేష్ బాబుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దృశ్యం 2 స్ట్రీమింగ్‌కు గాను ముందుగా నిర్మాత సురేష్ బాబు డిస్నీ వారితోనే సంప్రదింపులు జరిపారు. అయితే డీల్ కుదరని కారణంగా ఆ మూవీని అమెజాన్ ప్రైమ్‌కు విక్రయించారు. దీంతో అమెజాన్‌లో ఈ నెల 25వ తేదీన దృశ్యం 2 విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే చిత్ర స్ట్రీమింగ్ హక్కులను నిర్మాత సురేష్ బాబు ముందుగా తమకే విక్రయించారని.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆరోపిస్తోంది.
ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ తమకే ఉన్నాయని, ఆ హక్కులను సురేష్ బాబు తమకే విక్రయించారని డిస్నీ సంస్థ తెలిపింది. అయితే ఇతర స్ట్రీమింగ్ కంపెనీలకు ఆ హక్కులను అమ్మాలంటే తమతో చేసుకున్న అగ్రిమెంట్‌ను ముందుగా క్యాన్సిల్ చేసుకోవాలని.. కానీ సురేష్ బాబు అలా చేయలేదని, ఆయనకు మర్యాద, గౌరవం లేవని డిస్నీ సంస్థ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే తమను మోసగించారని ఆరోపిస్తూ డిస్నీ సంస్థ సురేష్ బాబుపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దృశ్యం 2 విడుదల ఆగిపోతుందా ? అన్న సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…